డిగ్రీ పాసయ్యారా… ఎస్‌బీఐలో 2000 ఉద్యోగాలు

-

ఎస్‌బీఐలో 2000 పీవో పోస్టులు

మీరు డిగ్రీ పాసయ్యారా…? భద్రమైన కొలువులు, ఆకర్షణీయమైన జీతభత్యాలు. ప్రారంభంలో కనీస వేతనం ఏడాదికి 8.50 లక్షలు. ప్రొబేషనరీ ఆఫీసర్లు. 2000 పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ ప్రకటన విడుదల చేసిన నోటిఫికేషన్ వివరాలు.

2000 Vacancies in SBI
2000 Vacancies in SBI

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీల సంఖ్య -2000
(జనరల్-810, ఓబీసీ-540, ఎస్సీ-300, ఎస్టీ-150)
పోస్టు: ప్రొబేషనరీ ఆఫీసర్
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్/సెమిస్టర్ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2019, ఆగస్టు 31 నాటికి సంబంధిత డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ సర్టిఫికెట్ ఉండాలి.

వయస్సు: 2019, ఏప్రిల్ 1 నాటికి కనీసం 21 ఏండ్లు, గరిష్ఠంగా 30 ఏండ్లకు మించరాదు.
పేస్కేల్: పోస్టింగ్ ప్రదేశాన్ని బట్టి ఏడాదికి కనీసం రూ.8.20 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.13.08 లక్షలు ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ.750/- (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ-లకు రూ.125/-)
ఎంపిక: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
ఆన్‌లైన్ రాతపరీక్ష ప్రిలిమినరీ (ఫేజ్-1), మెయిన్ (ఫేజ్-2) రెండు విధాలుగా ఉంటుంది.
ప్రిలిమినరీ 100, మెయిన్ 200 మార్కులకు ఉంటుంది.



ప్రకటించిన మొత్తం పోస్టుల్లో ఒక పోస్టుకు 10 మంది చొప్పున మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు.
మెయిన్ పరీక్ష ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలో ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తారు.
ఆబ్జెక్టివ్ పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు మార్కులు కోత విధిస్తారు.
ప్రిలిమినరీ పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్-30, క్వాంటి-టేటివ్ ఆప్టిట్యూడ్-35, రీజనింగ్ ఎబిలిటీ -35 ప్రశ్నలు ఇస్తారు.
మెయిన్ పరీక్షలో రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టి-ట్యూడ్-45, డాటా అనాలిసిస్ & ఇంటర్‌ప్రిటే-షన్-35, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్-నెస్-40, ఇంగ్లిష్ లాంగ్వేజ్-35 ప్రశ్నలు ఇస్తారు. ప్రిలిమినరీ పరీక్ష 90 నిమిషాలు, మెయిన్ పరీక్ష 3 గంటల్లో పూర్తిచేయాలి.
డిస్క్రిప్టివ్ రాత పరీక్ష 50 మార్కులకు ఉంటుంది. 30 నిమిషాల్లో పూర్తి చేయాలి. దీనిలో టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ (లెటర్ రైటింగ్& ఎస్సే). ఇది కేవలం క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే.
గ్రూప్ డిస్కషన్ 20 మార్కులకు, ఇంటర్వ్యూ 30 మార్కులకు ఉంటుంది.
ఫైనల్ సెలక్షన్‌లో మెయిన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఏప్రిల్ 22
ప్రిలిమినరీ పరీక్ష: జూన్ 8, 9 & 15,16
మెయిన్ ఆన్‌లైన్ టెస్ట్: జూలై 20
గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్
వెబ్‌సైట్:Click Here to Apply For SBI Jobs

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news