మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖకు చెందిన పుదుచ్చేరి లోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే… 456 పోస్టులను మొత్తం భర్తీ చేస్తున్నారు. అర్హత వివరాలలోకి వెళితే… ఈ పోస్టుల కి అప్లై చేయాలంటే బీఎస్సీ(ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ(పోస్ట్- సర్టిఫికేట్)/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్. లేదా డిప్లొమా (జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ) ని పూర్తి చేసి ఉండాలి. అలానే అప్లై చేసుకునే వాళ్ళకు రెండేళ్ల పని అనుభవం కూడా ఉండాలి.
ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 1 చివరితేది. ఇక వయస్సు విషయానికి వస్తే.. వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సాలరీ వచ్చేసి నెలకు రూ.44,900. దరఖాస్తు ఫీజు రూ.1,500 గా వుంది. ఎస్సీ, ఎస్టీలకు రూ.1,200 గా వుంది. దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు. ఈ పోస్టులకి సంబంధించి పూర్తి వివరాలను https://jipmer.edu.in/announcement/jobs లో చూడచ్చు.