విజయ్‌ బాలీవుడ్ సినిమా కమిట్మెంట్ కోసమే.!

విజయ్‌ దేవరకొండ హీరోగా.. మాస్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. భారీ అంచనాల మధ్య ఆగస్టులో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. విజయ్‌, పూరీ జగన్నాథ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇద్దామనుకున్న విజయ్‌కు , మంచి హిట్ కొట్టి పాన్ ఇండియా డైరెక్టర్ కావాలను కున్న పూరీ జగన్నాథ్ కు దెబ్బపడింది.

ఇక ఈ సినిమా నిర్మాత గా వ్యహరించిన ఛార్మి కౌర్ కు దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. వీరు ఏదో అనుకొని తీస్తే అది మరోలా రిజల్ట్ ఇచ్చింది. ఇక తర్వాత జరిగిన డిస్టి బ్యూటర్స్  రచ్చ , పూరీ జగన్నాథ్ ఒపెన్ లెటర్ రాయటం వంటి పెద్ద ఎపిసోడ్ నడిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ కొన్ని రోజుల పాటు ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక సమంత కు అనారోగ్యం తో ఉండటం వలన మళ్లీ ఖాళీ అయ్యాడు.

ప్రస్తుతం విజయ్ ముంబయి వెళ్ళాడని తెలిసింది. అయితే చాలా మంది ముంబయి లో తర్వాత సినిమా చర్చలు కోసం వెళ్లినట్లు అలాగే కరణ్ జోహార్ తో సినిమా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పనిలో పనిగా థమ్స్ అప్ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నాడట. ఇక ఎలాగూ వచ్చాడు కాబట్టి నెక్స్ట్ సినిమా కు కమిట్ మెంట్ తీసుకొని వెళదామని వచ్చాడట. అదే విజయ్ ‘లైగర్‌’ సినిమా హిట్ అయ్యుంటే బాలీవుడ్ వాళ్లే తన ముందు లైన్ కట్టే వారని తన అభిమానులు బాధ పడుతున్నారు.