నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన గూగుల్‌!

Join Our Community
follow manalokam on social media

నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనకు కృషి చేస్తోంది గూగుల్‌. తన ఆధ్వర్యంలో ప్రారంభించిన గ్రోవిత్‌ గూగుల్‌ కెరీర్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రాం ద్వారా నిరుద్యోగులకు డేటా ఎనలిటిక్స్, యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ డిజైన్‌ వంటి కోర్సులను అందించి వారికి ఉద్యోగాలు పొందడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌ కోర్సును కొత్తగా ప్రారంభించనుంది. దీంతో మార్కెట్లో కొత్తరకం మార్పునకు గూగుల్‌ శ్రీకారం చుట్టింది. అంతేకాదు తమ వద్ద ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి తమ సంస్థతోపాటు వేరే సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించడానికి సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా గూగుల్‌ అధినేత సుందర్‌ పిచాయ్‌ వెల్లడించారు. కానీ, మన దేశంలో ఉన్న సంస్థలు ఈ సర్టిఫికేషన్‌ ను ఓ డిగ్రీగా పరిగణిస్తాయా? వాటికి ఉద్యోగాలు దొరుకుతాయా? అనే సందేహం కలుగుతోంది. ఈ కోర్సులు ఓ అడిష్‌నల్‌ క్వాలిఫికేషన్‌గా చెప్పుకోవచ్చు, కానీ వీటికి ఉద్యోగాల కల్పించే పరిస్థితి లేదనే చెప్పాలి. ఈ సర్టిఫికెట్‌ పొందిన నిరుద్యోగులకు తాము ఉద్యోగాలు ఇస్తామని ఇన్ఫోసిస్, రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని బెటర్‌. కామ్‌ వెల్లడించాయి.

భారత్‌ లో టెక్‌ కంపెనీలు ఎదుర్కొంటున్న అతి ముఖ్య సమస్య స్కిల్స్‌ లేమి.. ఉద్యోగానికి అవసరమైన స్కిల్స్‌ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతుంటారు. ఈ లోటును సర్టిఫికెట్‌ ప్రోగ్రాం తీరుస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. గూగుల్‌ విద్యార్థులకు స్కిల్స్‌ నేర్పిస్తే వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. ఇది చాలా మంచి పరిణామమని చాలా కంపెనీలు వెల్లడిస్తుండడం విశేషం. అతి తక్కువ ఖర్చుతో కోర్సు పూర్తి చేసి మంచి జీతంతో ఉద్యోగాలు సంపాదించే వీలుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అయితే గతంలో కూడా గూగుల్‌ ఐటీ సపోర్ట్‌ సర్టిఫికేషన్‌ పేరుతో ఓ కోర్సును ప్రారంభించింది. ఆ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు అందించేందుకు సంస్థలు పెద్దగా ముందుకురాలేదు. ఇందులో స్కిల్స్, అనుభవంతో పాటు క్వాలిఫికేషన్‌ కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ సర్టిఫికేషన్ల వల్ల స్కిల్స్‌ పెరిగి జీతం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయేమో కానీ డిగ్రీలు లేకుండా కేవలం స్కిల్స్‌ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేసే పద్ధతైతే ఇప్పట్లో రాదని నిపుణులు వెల్లడిస్తున్నారు.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...