ఆంధ్రప్రదేశ్ లో దగ్గుబాటి కుటుంబం రాజకీయ ప్రయాణంపై ఇప్పుడు కాస్త ఆసక్తికర చర్చ జరుగుతుంది. దగ్గుబాటి కుటుంబం గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని మీడియా వర్గాల్లో ప్రచారం జరిగింది. ఇది ఎంతవరకు నిజమనేది తెలియకపోయినా సోషల్ మీడియాలో మాత్రం దీనిపై ఎన్నో కథనాలు వచ్చాయి. ఈ విషయంలో ఎక్కడా కూడా ఆ కుటుంబం స్పందించిన పరిస్థితి లేదని చెప్పాలి.
అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ కుటుంబం మీద దృష్టి పెట్టినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కి ఎంపీ సీటు ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. పార్టీలో కొనసాగితే ఖచ్చితంగా ఒంగోలు నుంచి ఎంపీ సీట్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చినట్టుగా ప్రకాశం జిల్లా టిడిపి వర్గాలు కూడా అంటున్నాయి. వైసీపీ నేతలు ఈ విషయంలో కాస్త వ్యవహరించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆయన గురించి కాస్త సానుకూలంగా చెప్పడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ విషయంలో కాస్త సీరియస్ గా వ్యవహరించడం అలాగే దగ్గుబాటి వెంకటేశ్వర రావు తో చర్చలు జరపడంతో ఆయన పార్టీ మారే ఆలోచన నుంచి తప్పుకున్నారని అంటున్నారు. మరి దగ్గుబాటి విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా లేదా అనేది చూడాలి.