ఎంసెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ ఇలా చేసుకోండి….!!

-

emcet-2019-hallticket-download
జేఎన్‌టీయూహెచ్ టీఎస్ ఎంసెట్-2019 హాల్‌టికెట్లను విడుదల చేసింది.
ఆన్‌లైన్ నుంచి మే 1 వరకు అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎంసెట్ ఎగ్జామ్‌ను మే 3, నుంచి నిర్వహించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో దీన్ని నిర్వహించనున్నారు.
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ఇలా…
టీఎస్‌ఎంసెట్-2019 సైట్‌లోకి వెళ్లాలి.
తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్, ఇంటర్ హాల్‌టికెట్ నంబర్, పుట్టినతేదీని సంబంధిత కాలమ్స్‌లో నింపాలి. వెంటనే హాల్‌టికెట్ వస్తుంది.
అభ్యర్థులు ఒక్కసారి వివరాలను పరిశీలించుకోవాలి. పేరు, అభ్యర్థికి సంబంధించిన సమాచారాన్ని సరిచూసుకోవాలి. ఏదైనా తప్పు ఉంటే వెంటనే సంబంధిత అథారిటీకి వెంటనే తెలియజేయాలి. దీనికి సంబంధించి కాంటక్ట్ నంబరు, మెయిల్ ఐడీల వివరాలు సైట్‌లో ఉన్నాయి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news