ఎన్‌టీఏ ఈసారి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (నీట్)ని నిర్వహిస్తుంది. ఈ పరీక్షతో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య, సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. డిగ్రీస్థాయి కోర్సుల ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నీట్‌ను నిర్వహిస్తారు. రాష్ట్రంలోని వైద్యకళాశాలలతోపాటు దేశంలోని ఇతర కాలేజీల్లో కూడా నీట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
నీట్ డ్రెస్ కోడ్ -ఎన్‌టీఏ గైడ్‌లైన్స్ ప్రకారం పరీక్షకు బూట్లతో అనుమతించరు. లో హీల్స్‌తో ఉన్న శాండల్స్‌ను అనుమతిస్తారు. ఫుల్ స్లీవ్‌లెస్‌లను అనుమతించరు. సంప్రదాయ దుస్తులు అంటే బురఖా లాంటివి ధరించేవారు ముందుగానే పరీక్ష హాలకు రావాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెకింగ్ చేసి లోనికి అనుమతిస్తారు.
నీట్‌కు హాజరయ్యే అభ్యర్థులు తేలికపాటి, హాప్ స్లీవ్‌లెస్ దుస్తులను ధరించి రావాలి.
లాంగ్ స్లీవ్‌లెస్‌లను అనుమతించరు, కాబట్టి సాధారణ దుస్తులను ధరించి పరీక్షకు హాజరుకావాలి.
అదేవిధంగా అడ్మిట్‌కార్డుతోపాటు వ్యాలిడ్ ఫ్రూప్‌ను తీసుకునిరావాలి.
ఈ ఏడాది సుమారు 15 లక్షల మంది నీట్‌ను రాయనున్నారు. గతేడాది 13 లక్షల మంది నీట్‌ను రాశారు. మెడిసిన్ చదివేవారికి నీట్ అర్హత తప్పనిసరి చేయడంతో ఈ ఏడాది నీట్ అభ్యర్థుల సంఖ్య పెరిగిందిజ
నీట్ పరీక్షను మే 5వ తేదీన నిర్వహించనున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించేవారు 12.30 కల్లా పరీక్ష హాలకు రావాలి. మిగిలినవారు 1.30 పీఎంకు రిపోర్టు చేయాలి.
నీట్ పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు. మధ్యాహ్నం రెండు నుంచి ఐదుగంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి మొత్తం 180 ప్రశ్నలు ఇస్తారు. 90 ప్రశ్నలు బయాలజీ నుంచి ఇస్తారు. ఫిజిక్స్-45, కెమిస్ట్రీ-45 ప్రశ్నలు ఇస్తారు.
– కేశవ