గుడ్ న్యూస్.. రైల్వేలో 4,660 పోలీస్‌ ఉద్యోగాలు

-

మీరు రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే మీకో శుభవార్త. ఇటీవల దాదాపు 14వేలకు పైగా పలు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించిన రైల్వేశాఖ.. తాజాగా మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (RPF), రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌లో 4,660 ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ చేసింది. వీటికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థులు ఏప్రిల్‌ 15 నుంచి మే 14వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు 4,660. వీటిలో 4,208 కానిస్టేబుల్‌, 452 ఎస్సై ఉద్యోగాలు ఉన్నాయి.

అర్హతలు: కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి; ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. అభ్యర్థులకు నిర్దిష్టమైన శారీరక ప్రమాణాలు అవసరం. 2024 జులై 1 నాటికి కానిస్టేబుల్ అభ్యర్థుల వయస్సు 18-28 ఏళ్లు, ఎస్సై అభ్యర్థులకు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా వర్గాల వారీగా వయో సడలింపు ఇస్తారు.

దరఖాస్తు రుసుం: ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/మహిళలు/ ట్రాన్స్‌జెండర్‌/ మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500. పరీక్షకు హాజరైతే రూ.400 రిఫండ్‌ చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news