గుడ్ న్యూస్: పదవ తరగతితోనే నేవీలో ఉద్యోగం… వివరాలు మీకోసం…!

Join Our Community
follow manalokam on social media

పదవ తరగతి పూర్తి చేశారా..? అయితే రక్షణ రంగం లో ఉద్యోగం పొందే సూపర్ అవకాశం. నేవి లోని ఈస్ట్రన్, వెస్ట్రన్, సదరన్ కమాండ్ల లోని 1159 ట్రేడ్స్ మ్యాన్ మేట్ గ్రూప్ – సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… నేవి లోని ఈస్ట్రన్, వెస్ట్రన్, సదరన్ కమాండ్ల లోని 1159 ట్రేడ్స్ మ్యాన్ మేట్ గ్రూప్ – సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మీకు కనుక ఆసక్తి, అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అర్హత ఏమిటంటే..? పదో తరగతి ఉత్తీర్ణత తోపాటు సంబంధిత విభాగంలో ఐటిఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. మొత్తం 1159 ఖాళీలు వున్నాయి. మీ వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసు లో సడలింపు వర్తిస్తుంది.

షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇండియన్ నేవీ కంప్యూటర్ బెస్ట్ నిర్వహిస్తుంది. ఈ పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇక వేతనం వచ్చేసి నెలకు రూ. 18,000 నుంచి 56,900 వరకు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ. 205 చెల్లించాల్సి ఉంటుంది. మహిళ, ఎస్సీ , ఎస్టీ, పిడబ్ల్యుడి , ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది గమనించండి. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మర్చి ఏడవ తేదీ లోగ దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం https://www.joinindiannavy.gov.in లో చూడొచ్చు.

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...