మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో పలు ఖాళీలు వున్నాయి. ఈ మేరకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు చెందిన ఈ సంస్థలో పోస్టులను భర్తీ చేయనున్నారు. గోవాలో ఉన్న ఈ సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో పోస్టులను రిక్రూట్ చేయడం జరుగుతున్నాయి. అయితే మొత్తం పదకొండు ఖాళీ వున్నాయి. ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి.
ఇక వయస్సు విషయానికి వస్తే.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో పోస్టులకి అప్లై చేసుకోవాలంటే వయస్సు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక విద్యార్హతల వివరాల లోకి వెళితే.. ఈ పోస్టులకి అప్లై చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీఈ/బీటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే ఆన్ లైన్ పద్దతి లో అప్లై చేసుకోవచ్చు.
శాలరీ ఎంత ఉంటుంది అనేది చూస్తే… ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 20,000 నుంచి రూ. 56,000 వరకు చెల్లిస్తారు. ఈ పోస్టులని సెలెక్ట్ చేసేటప్పుడు ఇంటర్వ్యూ ని నిర్వహిస్తారు. దాని ప్రకారమే భర్తీ చేస్తారు. ఈ పోస్టులకి అప్లై చెయ్యడానికి జనవరి 2 ,2022 ఆఖరి తేదీ. కనుక ఆలోగా అప్లై చేసుకోవడం మంచిది. పూర్తి వివరాలని మీరు https://www.nio.org/ లో చూసి అప్లై చేసుకోవచ్చు.