పది అర్హతతో కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలు.. వివరాలివే..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ కోస్ట్ గార్డ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ తాజాగా నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..

మొత్తం 96 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వార భర్తీ చేస్తోంది. సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఫిట్టర్, స్టోర్ కీపర్, లాస్కర్, ఇంజిన్ డ్రైవర్, సారంగ్ లాస్కర్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ఫైర్‌మ్యాన్ ఖాళీలు వున్నాయి. జనవరి 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ.

కనుక ఈలోగా అప్లై చేసుకోవడం మంచిది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే పది అర్హతతో పాటు సంబంధిత విభాగంలో ట్రేడ్‌ సర్టిఫికెట్‌, అనుభవం ఉన్నవాళ్లు అప్లై చేసుకోచ్చు. ఎంపికైన వాళ్లకు 5,200 రూపాయల నుంచి 20,200 రూపాయల వేతనం లభిస్తుంది. పోస్టుల వివరాల లోకి వెళితే..

ఇంజిన్ డ్రైవర్ 5 పోస్టులు, సారంగ్ లాస్కర్ 2 పోస్టులు, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ 5 పోస్టులు, ఫైర్‌మెన్ 53 ఉద్యోగ ఖాళీలు, సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ 11 ఉద్యోగ ఖాళీలు, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఫిట్టర్ 5 ఉద్యోగ ఖాళీలు, స్టోర్ కీపర్ గ్రేడ్2 3 ఉద్యోగ ఖాళీలు, స్ప్రే పెయింటర్ 1 వున్నాయి. అలానే మోటార్ ట్రాన్స్‌పోర్ట్ మెకానిక్ ఒక పోస్ట్, లాస్కర్ 5 ఉద్యోగ ఖాళీలు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ప్యూన్) 3 పోస్టులు, అన్‌స్కిల్డ్ లేబర్ 2 పొస్టులు ఉన్నాయి. joinindiancoastguard.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు