మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసును చాటు కున్నాడు. మూడేళ్ల కిందట.. అనారోగ్యంతో.. మరణించిన టీఆర్ ఎస్ కార్యకర్త కుటుంబానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం అక్కపల్లికి చెందిన టీఆర్ ఎస్ కార్యకర్త మందాటి కొమురయ్య మూడేళ్ల క్రితం మరణించారు. ఇటీవల కొమురయ్య కూతురు అంజలికి వివాహం నిశ్చయమైంది.
సోమవారం ఎల్లారెడ్డి పేట లో ఆమె వివాహం జరుపగా.. సమాచారం తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. ఆర్థిక సాయం అందించారు. టీఆర్ ఎస్ పార్టీ జిల్లా ఇంచార్జి తోట ఆగయ్య, మంత్రి ఏపీ కుంబాల మహేందర్ రెడ్డి తో కలిసి అంజిలికి రూ.3 లక్షల చెక్కును అందజేశారు. ఎల్లా రెడ్డి పేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి నవ వధువుకు పుస్తె మట్టెలను బహుమణంగా ఇచ్చారు. ఈ సందర్భంగా కొమురయ్య కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.