ఇంటర్‌, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు..124 ఖాళీలు.. ఇలా అప్లై చేసేయండి..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. మహారాష్ట్ర లోని నాగ్‌ పూర్‌ లో వున్న విశ్వేశ్వరాయ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పలు పోస్టులని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

మహా రాష్ట్ర లోని నాగ్‌ పూర్‌ లో వున్న విశ్వేశ్వరాయ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ లో మొత్తం 124 ఖాళీలు వున్నాయి. ఇక అర్హత విషయానికి వస్తే.. వేర్వేరు పోస్టులకి వేర్వేరు విద్యార్హతలు వున్నాయి. ఈ పోస్టులకి అప్లై చేయాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్/ఐటీఐ/బ్యాచిలర్స్‌ డిగ్రీ/బీఈ/బీటెక్‌/డిప్లొమా/ఎంసీఏ/మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి.

ఇక మనం వయస్సు విషయానికి వస్తే… ఈ పోస్టుల కి అప్లై చేసుకోవాలని అనుకునే వారి వయస్సు 27 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. డిసెంబర్‌ 27, 2022వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు గురించి చూస్తే అభ్యర్ధులు రూ.400లు అప్లికేషన్‌ ఫీజు కింద కట్టాలి. కానీ ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు మాత్రం ఏ ఫీజు లేదు. షార్ట్‌లిస్టింగ్‌, రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలని https://vnit.ac.in/index.php/position-open/ లో చూసి అప్లై చేసుకోవచ్చు.