తప్పు తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి..!!

మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు సినిమా పరిశ్రమ దిగ్గజం గా అందరికి తెలిసిందే. ఇక తాను అంతకు ముందు సినిమాలను వదిలి తాను బాధపడి, అభిమానులను కూడా భాద పెట్టారు. రాజకీయాలలో ఎంతో మంది ఎన్నో విమర్శలు చేశారు. ఇక మళ్లీ రాజకీయాలు వదిలి సినిమాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు.

ఇప్పుడు వరసగా సినిమాలు చేస్తున్న హీరోలలో చిరంజీవి మాత్రమే ఉన్నారని చెబితే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఒక సంవత్సరం వ్యవధిలో తనవి రెండు సినిమాలు విడుదల అయ్యి మరో సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ కోసం రెడీగా వుంది. మరో మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇలాంటి ఫీట్ ఇప్పుడున్న యంగ్ హీరోలకు కూడా సాధ్యం కాదు.

రాజకీయాలు తన మనస్తత్వం కు సరిపడవు అని నాకు తెలిసి పోయింది అని చాలా సార్లు వ్యాఖ్యానించారు. తాజాగా 53వ అంతర్జాతీయ చలన చిత్రాత్రోవాల్లో ఆయన మనసులో మాటని మరోసారి బయట పెట్టారు. ‘ సినిమాల్లోకి తిరిగి వచ్చిన తర్వాత  అభిమానులు రెట్టింపు అభిమానం చూపించారు తప్ప తగ్గించలేదు.  వాళ్లందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను.  ఇక ఎప్పటికీ సినిమాలు ఆపే ప్రసక్తే లేదని అన్నారు. ఓపిక ఉన్నంతవరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం చిరు వాల్తేరు వీరయ్య సినిమా లో నటిస్తూ ఉన్నాడు.