రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ …

-

భారతీయ రైల్వేకు చెందిన పలు విద్యాసంస్థలు ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తు ప్రక్రియకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌స్టిట్యూట్ (NRTI ) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులున్నాయి. ఎన్ఆర్‌టీఐలో మొత్తం 39 ఖాళీలు ఉన్నాయి. కానీ, ఇవి పెర్మనెంట్ పోస్ట్ లు కాదు. అయితే ఇవి కేవలం కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఇందుకు అప్లై చేసుకోడానికి నవంబర్ 10, 2020 ఆఖరు తేదీ.

ఈ నోటిఫికెషన్స్ కి సంబంధించిన పూర్తి వివరాలను https://www.nrti.edu.in పోర్టల్లో చూసి తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు వాళ్లకి తగిన విద్యార్హతలు ఉన్నాయో లేదో పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి. అభ్యర్థుల విద్యార్హతల వివరాలకి వస్తే అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిప్యూటీ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులకు పీహెచ్‌డీ డిగ్రీ ఉండాలి. ప్రొఫెసర్‌గా 5 నుంచి 10 ఏళ్లు పని చేసిన అనుభవం ఉండాలి. అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 55 ఏళ్ల లోపు ఉండాలి. ఇతర పోస్టులకు సంబంధిత సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ ఇంకా పని చేసిన అనుభవం ఉండి తీరాలి.

నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌స్టిట్యూట్ భారతీయ రైల్వేకు చెందిన విద్యా సంస్థ ఇది. ఈ సంస్థ 2018లో ఏర్పాటైంది. భారతదేశంలో రవాణా రంగానికి సంబంధించిన కోర్సులను అందించే మొట్ట మొదటి ఇన్‌స్టిట్యూట్ ఇదే కావడం విశేషం. ఇందులో విద్యార్థులు యూజీ, పీజీ కోర్సులు చేయొచ్చు. రైల్వేలో లేదా రవాణా రంగంలో పనిచేయాలన్న ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఇన్‌స్టిట్యూట్ ‌లో బీబీఏ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజ్‌మెంట్, బీఎస్‌సీ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ, బీటెక్ ఇన్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ రైల్ సిస్టమ్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులు చెయ్యచ్చు. ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజ్‌మెంట్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ, ట్రాన్స్‌పోర్ట్ టెక్నాలజీ అండ్ పాలసీ, ట్రాన్స్‌పోర్ట్ ఎకనమిక్స్, ట్రాన్స్‌పోర్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ అనలిటిక్స్‌లో ఎంఎస్సీ వంటి పలు కోర్సులు అందిస్తున్నారు. ఈ సంస్థ యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్‌ తో కలిసి ఎంఎస్ ఇన్ రైల్వే సిస్టమ్స్ ఇంజనీరింగ్ అండ్ ఇంటిగ్రేషన్ ఇంటర్నేషనల్ డిగ్రీ ప్రోగ్రామ్ అందిస్తోంది ఎన్ఆర్‌టీఐ.

Read more RELATED
Recommended to you

Latest news