మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌లో 275 ఖాళీలు.. వివరాలివే..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో అంగ‌న్‌వాడీ ఎక్సెటెన్ష‌న్ ఆఫీస‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు.

jobs
jobs

ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 275 ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌నున్నారు. అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, కో ఆర్డినేట‌ర్లు, ఇన్‌స్ట్ర‌క్ట‌ర్లు, కాంట్రాక్టు సూప‌ర్ వైజ‌ర్స్ కూడా ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు.

ఇక ఖాళీల వివరాల లోకి వెళితే.. మొత్తం 275 ఉద్యోగాలు ఉండగా.. కాళేశ్వ‌రం 56, బాస‌ర‌ 68, రాజ‌న్న‌ 72, భ‌ద్రాది 79 వున్నాయి. అభ్య‌ర్థి వ‌య‌సు 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ప‌దో త‌ర‌గ‌తి పాసవ్వాలి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://wdcw.tg.nic.in/ ను సంద‌ర్శించాలి. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూస్తే…

ముందుగా https://tswdcw.in/Images/Notification%20-%20Gr-II%20-%20Warangal%20region.pdf మీద క్లిక్ చెయ్యండి.
అక్కడ Apply Online ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.
నెక్స్ట్ మీరు Click here to pay Amount ఆప్ష‌న్ క్లిక్ చేయాలి.
ఇప్పుడు ఫీజు చెల్లించాలి.
త‌రువాత Click Here if amount paid already ఆప్ష‌న్ క్లిక్ చేయాలి.
ఇప్పుడు అప్లికేష‌న్ ఫాంను పూర్తి చేయాలి.
స‌బ్‌మిట్ చేసిన అనంత‌రం ర‌సీదు వ‌స్తుంది.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.