యూనియన్‌ బ్యాంక్‌లో 347 ఉద్యోగాలు..వివరాలు ఇవే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( యూనియన్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు | Jobs In Union Bank ) నోటిఫికేషన్ ని విడుదల చేసింది. అయితే మొత్తం 347 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

 

Jobs in union bank of india | యూనియన్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు
Jobs in union bank of india | యూనియన్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు

దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 12న ప్రారంభం కాగా.. సెప్టెంబర్‌ 3 దరఖాస్తులకు చివరి తేది. విద్యార్హతలు చూస్తే.. పోస్టులను బట్టి వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టులను బట్టి ఏదైనా గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌, ఎంబీఏ, సీఏ/సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ)/సీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి అని తెలిపింది.

పోస్టుల వివరాలు చూస్తే.. సీనియర్ మేనేజర్ (రిస్క్)- 60, మేనేజర్ (రిస్క్)- 60, మేనేజర్ (సివిల్ ఇంజనీర్)- 7, మేనేజర్ (ఆర్కిటెక్ట్) – 7, మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజర్) – 2, మేనేజర్ (ప్రింటింగ్ టెక్నాలజిస్ట్) – 1, మేనేజర్ (ఫోరెక్స్‌) – 50, మేనేజర్ (ఛార్టెడ్ అకౌంటెంట్) – 14, అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్) – 26, అసిస్టెంట్ మేనేజర్ (ఫోరెక్స్‌) – 120.

వయసు విషయానికి వస్తే.. సీనియర్ మేనేజర్ విభాగంలో ఉద్యోగాలకు అప్లై చెయ్యాలంటే అభ్యర్థుల వయస్సు 30-40 ఏళ్లు ఉండాలి. అదే మేనేజర్ ఉద్యోగాలకు 25-35 ఏళ్లు ఉండాలి. ఇక అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు అయితే 20-30 ఏళ్లు ఉండాలి. ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌, గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.దరఖాస్తు ఫీజు రూ.850 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.unionbankofindia.co.in/ వెబ్‌సైట్‌ లో చూడొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news