ఇండియన్ ఆర్మీ ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. 57వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) మెన్, 28వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) ఉమెన్ కోర్స్ కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. నోటిఫికేషన్ ద్వారా 191 ఖాళీలను భర్తీ చేస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
పెళ్లికాని యువతీయువకులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2021 జూన్ 23 చివరి తేదీ. అంటే మరో రెండు రోజులే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను http://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఉంటుంది. మొత్తం 191 ఖాళీలు ఉండగా అందులో 57వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) మెన్– 175 పోస్టులున్నాయి. సివిల్– 60, మెకానికల్– 5, ఆర్కిటెక్చర్– 1 , ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్– 8, ఎలక్ట్రానిక్స్– 2, ఇంకా ఇతర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది.
ఇక 28వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) ఉమెన్ కోర్స్ 14 పోస్టులున్నాయి. విద్యార్హతల వివరాలు చూస్తే సంబంధిత బ్రాంచ్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ పాస్ కావాలి. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి. అభ్యర్థులకు ఫీజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా సెలెక్ట్ చేయనున్నారు. సంబంధిత వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.