ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే తొలి పండగ నాగపంచమి( Nag Panchami ). ఈ సంవత్సరం ఆగస్టు 13వ తేదీన నాగ పంచమి వచ్చింది. నాగ పంచమి నాడు దేశ వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున నాగ దేవతకు పూజ చేస్తూ ఉంటారు. పాపాల నుండి విముక్తి పొందడం కోసం తరతరాల నుండి నాగదేవతని పూజించడం ఆనవాయితీ. అయితే నాగ పంచమి అంటే ఏమిటి..?, నాగ పంచమి నాడు ఏమి చేయాలి..? ఇలా ఎన్నో విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
విష్ణుమూర్తి ఆదిశేషుని అనుగ్రహించిన రోజునే నాగ పంచమి అని పురాణాలు చెబుతున్నాయి. ఆదిశేషుని కోరికను మన్నించిన మహావిష్ణువు శ్రావణ శుక్ల పంచమి రోజున ప్రజలంతా సర్ప పూజలు చేస్తారని వరమిచ్చాడు. నాగపంచమి రోజున సర్ప పూజ చేస్తే శుభం కలుగుతుంది. అదే విధంగా సకల పాపాలు తొలగిపోయి ప్రజలు ఆనందంగా జీవించడానికి పరమశివునితో పాటు ఆయన మెడలో ఉన్న నాగుపామును కూడా పూజిస్తారు.
ఒకవేళ ఎవరైనా కాల సర్ప దోషం తో ఉంటే ఈరోజు నాగదేవతకి పూజ చేయడం అత్యంత శుభప్రదం. నాగ పంచమి రోజున తెల్లవారే లేచి ఇల్లు శుభ్రంగా ఉంచుకుని ఆ తర్వాత పుట్ట వద్దకు వెళ్ళి నీళ్ళు చల్లి, ముగ్గు వేసి పసుపు కుంకుమలతో పూజలు చేస్తారు. నాగ దేవతని మనసులో స్మరించుకుంటూ.. పాలు పండ్లు అర్పిస్తారు. అదే విధంగా ఆరోజు అంతా కూడా ఉపవాసం చేసి రాత్రి వేళ భోజనం చేస్తారు. నాగ పంచమి రోజు కొందరైతే చెక్క, వెండి లేదా రాతితో చేసిన నాగ బొమ్మలని కొంటూ ఉంటారు.