ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పోస్టులు.. ఇలా అప్లై చెయ్యండి..!

తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పలు ఉద్యోగాల భర్తీ చేసేందుకు ఒక నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది. మొత్తం 55 సివిల్ జడ్జి పోస్టులు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వాళ్ళు ఆగస్టు 20 లోగ చేసుకోవాలి. అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న వారికి కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

ఇక వయస్సు విషయం లోకి వస్తే.. అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలని నోటిఫికేషన్ లో తెలిపారు. బ్యాచలర్ డిగ్రీ(లా) చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వాళ్లకి రూ.27700 నుంచి రూ.44700 వరకు చెల్లించనున్నారు.

పరీక్షలను రాజమండ్రి, గుంటూరు, కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో నిర్వహించనున్నారు. స్క్రీనింగ్ టెస్ట్ ను సెప్టెంబర్ 26న నిర్వహించనున్నారు.

ఇక పరీక్ష గురించి చూస్తే.. మొదట స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఇది ఆబ్జెక్టీవ్ విధానంలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు 100 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సమయం 2 గంటలు. 40 శాతానికి పైగా మార్కులు సాధించిన వారికి 1:10 పద్ధతిలో షార్ట్ లిస్ట్ చేస్తారు.

అదే రాత పరీక్ష అయితే 100 మార్కుల చొప్పున మొత్తం 3 పేపర్లు ఉంటాయి. సివిల్ లా, క్రిమినల్ లా, ఇంగ్లిష్ ట్రాన్స్లేషన్ టెస్ట్, ఎస్సే టెస్ట్ ఉంటాయి. దీనిలో కనుక ఎంపిక అయితే వైవా ఉంటుంది.

అధికారిక వెబ్ సైట్: https://hc.ap.nic.in/