ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నిత్యం విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఒకటి అని కాదు ప్రతి అంశంలోనూ జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తూ వస్తున్నారు. ఏదొక విధంగా వైసీపీని దెబ్బకొట్టి, టీడీపీని పైకి లేపాలని బాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుని అడ్డం పెట్టుకుని వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు బాగా ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ నాయకులు ముందు నుంచి చెబుతున్నారు.
చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలో రఘురామ భాగమని, రఘురామని అడ్డం పెట్టుకుని తమ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని వైసీపీ నేతలు ఎప్పటినుంచో ఆరోపిస్తూనే ఉన్నారు. అయితే వైసీపీ నేతలు ఆరోపణలైతే చేస్తునాన్నారుగానీ, అందుకు తగ్గట్టు ఆధారాలు మాత్రం చూపించలేకపోయారు. పైగా రఘురామపై రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయడం పెద్ద వివాదమైంది. అది వైసీపీ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. అక్కడ నుంచి రఘురామ మరింతగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
అయితే తాజాగా రాజద్రోహం కేసు విషయంలో ఏపీ సిఐడి కొన్ని ఆధారాలని సుప్రీం కోర్టులో అఫడవిట్ వేశారు. అందులో రఘురామ ఫోన్ ద్వారా, చందబాబు, లోకేష్‌లతో చేసిన వాట్సాప్ చాటింగ్ వివరాలు కూడా ఉన్నాయి. రాజద్రోహం కేసులో సిఐడి, రఘురామని అరెస్ట్ చేసినప్పుడు, ఆయన ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నారు.
ఇక ఫోన్ ఆధారంగానే అన్నీ వివరాలని కోర్టుకు సమర్పించారు. దీనిపై రఘురామ గానీ, టీడీపీ నేతలుగానీ కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు. దీంతో చంద్రబాబు, రఘురామని అడ్డం పెట్టుకుని, జగన్‌ని దెబ్బకొట్టాలని చూసి, ఇప్పుడు వారే అడ్డంగా బుక్ అయ్యారని తెలుస్తోంది. మరి ఈ అంశంపై సుప్రీం కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి. ఏదేమైనా చంద్రబాబు-రఘురామ కుట్రలని బయటపెట్టడంలో జగన్ ప్రభుత్వం సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది.