PLI స్కీమ్ తో.. ఫోన్ తయారీ రంగంలో… 1,50,000 కొత్త ఉద్యోగాలు..

-

ఇండియా టెక్ మరియు తయారీ కంపెనీలు లో మరెంత ముందుకి రావాలని ప్రభుత్వం చూస్తోంది అందుకే ఈ ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో మొబైల్ తయారీ లో 1,50,000 వరకు కొత్త ఉద్యోగాలు రానున్నాయని తెలుస్తోంది. రిక్రూట్మెంట్ ఫర్మ్ అఫీషియల్స్ భారతదేశంలో పెద్ద ఎత్తున నియామకాలను ప్లాన్ చేస్తున్నారని నివేదిక ద్వారా తెలుస్తోంది. పూర్తి వివరాల్ని చూస్తే.. చైనాను మించి తయారి చేయాలని చూస్తున్నారు. భారత ప్రభుత్వ ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహకాల (PLI) పథకం ద్వారా తీసుకు రానున్నారని నివేదిక పేర్కొంది.

 

స్టెఫిన్గ్ కంపెనీస్ తో సహా టీమ్‌లీజ్, రాండ్‌స్టాడ్, క్వెస్ మరియు సీల్ హెచ్‌ఆర్ సర్వీసెస్‌తో ఈ ఆర్థిక సంవత్సరంలో 120,000 నుంఫై150,000 కొత్త ఉపాధిలో దాదాపు 30,000–40,000 మంది ప్రత్యక్ష స్థానాలు, మిగిలిన పరోక్ష స్థానాలు వుండనున్నాయి అని తెలుస్తోంది. Samsung, Nokiam Foxconn, Wistron, Pegatron, Tata Group, Salcomp వంటి పెద్ద కార్పొరేట్ దిగ్గజాలు కూడా వర్క్ ఫోర్స్ ని పెంచవచ్చని తెలుస్తోంది.  టీమ్‌లీజ్ సర్వీసెస్‌లోని స్టాఫింగ్ సీఈఓ కార్తీక్ నారాయణ్ ETతో మాట్లాడుతూ… “చాలా మొబైల్ బ్రాండ్‌లు కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ మరియు అసెంబ్లింగ్ భాగస్వాములు తయారీని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు” అని చెప్పారు.

పోయిన ఏడాది తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 100 శాతం మేండెట్‌లు పెరిగాయని క్వెస్ సీల్ హెచ్‌ఆర్ అధికారులు అన్నారు. సాంకేతిక నిపుణులు, సూపర్‌వైజర్లు అవసరం ఎంత గానో ఉందన్నారు. గత రెండు త్రైమాసికాల నుండి చూసిన సగటు డిమాండ్‌ తో పోలిస్తే దాదాపు రెండింతలు పెరగడాన్ని చూసినట్టు తెలిపారు. ప్రభుత్వం PLI పథకం ద్వారా ఉద్యోగాలని పెంచి ఉత్పత్తిని పెంచడం అవసరమే అని స్థానిక మార్కెట్‌ నుండి మొదలు పెట్టాలని అలా క్రమంగా ఎగుమతులకు తోడ్పాటుని ఇచ్చేలా ఉత్పత్తిని పెంచాలని టీమ్‌లీజ్‌కి చెందిన నారాయణ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news