బీటెక్ తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.. వివరాలివే…!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన ఢిల్లీ లోని స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా కాంట్రాక్టు పోస్టులని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. భారత యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన ఢిల్లీలోని స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా తాజాగా ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసింది.

jobs
jobs

 

ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. సీనియర్ లీడ్ (రీసెర్చ్) పోస్టులు 04 వున్నాయి. బీటెక్/ఎంబీఏ/సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత పొందిన వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అప్లై చెయ్యాలని అనుకుంటే నెలకు రూ.80,000 నుంచి రూ.1,45,000 వరకు ఇస్తారు. అలానే లీడ్ రీసెర్చ్ 06 పోస్టులు వున్నాయి. ఈ పోస్టుకి అప్లై చెయ్యాలని అనుకుంటే బీటెక్/ఎంబీఏ/పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి. అలానే వయస్సు వచ్చేసి 2021 అక్టోబరు 31 నాటికి 32 ఏళ్లు మించకుడదు. రూ.45,000 నుంచి రూ.60,000 వరకు నెలకి పే చేస్తారు.

అలానే సోర్ట్స్ అసోసియేట్ 05 పోస్టులు వున్నాయి. ఈ పోస్టులకి అప్లై చెయ్యాలంటే బీటెక్/ఎంబీఏ/పీజీడీఎం ఉత్తీర్ణత తో పాటు ఆరు నెలల అనుభవం కూడా ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే.. 2021 అక్టోబరు 31 నాటికి 32 ఏళ్లు మించకుడదు. శాలరీ విషయానికి వస్తే.. 2021 అక్టోబరు 31 నాటికి 32 ఏళ్లు మించకుడదు. ఈ పోస్టులకి అయితే నెలకు రూ.45,000 నుంచి రూ.50,000 వరకు చెల్లిస్తారు. అప్లై చెయ్యడానికి 2021 నవంబరు 11 చివరి తేదీ. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. పూర్తి వివరాలని https://sportsauthorityofindia.nic.in/sai/ లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news