ఆయన జీవిత చరిత్రను సినిమా తీస్తా… నన్నెవరూ ఆపలేరు :బండ్ల

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తాజాగా కీలక ప్రకటన చేశారు. తాను త్వరలో గణపతి సచ్చిదానంద స్వామి జీవిత చరిత్రను సినిమాగా తీస్తానని బండ్ల గణేష్ ప్రకటించారు. బండ్ల మైసూరు వెళ్లి గణపతి సచ్చిదానంద స్వామిని కలిశారు. అయితే ఆయన తన జీవిత చరిత్రను సినిమాగా తీయాలని ఆదేశించారని కాబట్టి ఆయన జీవిత చరిత్రను సినిమాగా తీస్తానని బండ్ల ప్రకటించారు. అంతేకాకుండా తనను ఎవరు ఆపలేరు అంటూ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో తెలిపారు.

producer bandla ganesh posts his corona negative report

“అప్పాజీ జీవిత చరిత్ర నేనే చేసి తీరుతా… అయన పాదాల సాక్షిగా నాకు అనుమతించారు…ఎవరి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు.” అంటూ బండ్ల గణేష్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బండ్ల గణేష్ ఇటీవల మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించి ఆ తర్వాత తప్పుకున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తానని ప్రకటించిన బండ్ల ఇప్పటివరకు ఆ సినిమాపై ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం బండ్ల గణేష్ తానే హీరోగా ఓ సినిమాలో నటిస్తున్నారు.