డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌లో క్లర్క్ ఉద్యోగాలు… పూర్తి వివరాలు ఇవే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం లోని విజయనగరం జిల్లా డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ లో కొన్ని పోస్టులు ఖాళీ వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక మరి దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ లో 32 పోస్టులు ఖాళీ వున్నాయి. ఇక పోస్టుల వివరాలని చూస్తే.. స్టాఫ్‌ అసిస్టెంట్‌/ క్లర్క్‌ పోస్టులు దీనిలో వున్నాయి.

అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి డిగ్రీ ప్యాస్ అయ్యి ఉండాలి. అలానే స్థానిక భాష, ఇంగ్లిష్‌ భాషలో ప్రావీణ్యం తప్పక ఉండాలి. అదే విధంగా కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా అవసరం. ఈ అర్హతలు ఉన్నవాళ్లే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాల్సి వుంది. అలానే ఈ పోస్టులకి విజయనగరం జిల్లాకు చెందిన వాళ్ళే దరఖాస్తు చేసుకోవాలి. ఇక వయసు వివరాలు చూస్తే.. ఈ పోస్టులకి అప్లై చేయాలంటే జనవరి 1, 2023వ తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఏప్రిల్‌ 15, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఫీజు విషయానికి వస్తే.. జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.590లు, ఎస్సీ/ఎస్టీ/పీసీ/ఎక్స్ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులు రూ.413లు అప్లికేషన్‌ ఫీజు కింద చెల్లించాల్సి వుంది. నెలకు రూ.17,900ల నుంచి రూ.47,920ల వరకు జీతంగా ఇస్తారు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌, రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగాల్లో పరీక్ష ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ కూడా ఉంటుంది. పూర్తి వివరాలను https://www.dccbvizianagaram.com/careers/ లో చూసి అప్లై చెయ్యచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news