నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు… ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌ లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌లో ఎగ్జిక్యూటివ్ లో 26 ఎగ్జిక్యూటివ్ పోస్టులు వున్నాయి.

jobs
jobs

ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌ ప్యాస్ అయ్యి ఉండాలి. 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి. దానితో పాటుగా పనిలో రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే వయస్సు 35 ఏళ్ళు దాటి వుండకూడదు.

ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ నవంబర్‌ 30, 2022. ఇక ఫీజు విషయానికి వస్తే అప్లై చేసుకోవాలని అనుకునే వారు రూ.300లు అప్లికేషన్‌ ఫీజు గా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు అయితే ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. సాలరీ విషయానికి వస్తే… రూ.90,000ల వరకు చెల్లిస్తారు. పూర్తి వివరాల ని https://careers.ntpc.co.in/ లో చూడచ్చు. అలానే ఈ లింక్ ద్వారా అప్లై చెయ్యచ్చు కూడా.

Read more RELATED
Recommended to you

Latest news