విద్యార్థులకి గుడ్ న్యూస్.. 20 వేలు స్కాలర్‌షిప్…!

-

విద్యార్ధులకి గుడ్ న్యూస్. స్కాలర్‌షిప్‌ ని పొందే అవకాశం ఒకటి లభించింది. పూర్తి వివరాలను చూసి స్కాలర్‌షిప్‌ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలను చూస్తే.. ఎల్ఐసీ ప్రతి సంవత్సరం కొత్త స్కాలర్‌ షిప్ పథకాలను తీసుకు వస్తుంది. అయితే ఇప్పుడు LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ ని తీసుకు రావడం జరిగింది.

ఆర్ధికంగా వెనకబడిన విద్యార్థులందరికీ ఈ స్కాలర్‌షిప్ హెల్ప్ అవుతుంది. వస్తుంది. పైగా చాలా మందికి ఉన్నత చదువులు చదివించే సామర్థ్యం ఉండదు. అలాంటి వాళ్ల కి ఎల్‌ఐసీ అందించే ఈ స్కాలర్‌షిప్‌ ఉపయోగ పడుతుంది. 12వ తరగతి ఉత్తీర్ణత పొంది కాలేజీలో చేరాలని అనుకునే వాళ్ళు ఎల్‌ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ పొందొచ్చు. ఎల్‌ఐసీ ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది కనుక ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవుతుంది.

ఈ స్కాలర్ షిప్ ద్వారా రూ. 20,000 ని పొందొచ్చు. మూడు నెలల వ్యవధి లో విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందుతుంది. అంటే నాలుగు నెలలకు రూ. 5000 వస్తాయి. ఇక దరఖాస్తు ప్రక్రియ కోసం చూస్తే.. అధికారిక వెబ్‌సైట్ నుండి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ విధానం లో అప్లై చేసుకునేందుకు అవుతుంది.

అయితే విద్యార్థులు ఈ బెనిఫిట్ ని పొందాలంటే 12వ తరగతిలో 65 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. అలానే వార్షిక ఆదాయం లక్షకు మించకూడదు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన ఉన్నత విద్యను పొందాలని అనుకునే బాలికలందరూ ఎల్‌ఐసి స్కాలర్‌ షిప్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రైవేట్ కాలేజీలు లేదా ఇన్‌స్టిట్యూట్‌ల లో డిప్లొమా, ఐటీఐ, పోస్ట్‌గ్రాడ్యుయేట్ చేయాలనుకునేవారు అప్లై చేసుకోవచ్చు.

LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ కోసం అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే:

ఆధార్ కార్డ్
ఆదాయ ధృవీకరణ పత్రం
బ్యాంకు స్టేట్‌‌మెంట్
టెన్త్, పన్నెండవ తరగతి మార్క్ షీట్
పాస్పోర్ట్ సైజు ఫోటో
మొబైల్ నంబర్

Read more RELATED
Recommended to you

Latest news