గుడ్​న్యూస్.. 4,045 పోస్టులకు IBPS నోటిఫికేషన్‌

-

బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఎట్టకేలకు ఐబీపీఎస్​ 4,045 క్లర్క్​ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. కామన్​ రిక్రూట్​మెంట్ ప్రక్రియ ద్వారా ఎంపికైన అభ్యర్థులను దేశవ్యాప్తంగా మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన శాఖల్లో నియమించనుంది.

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కచ్చితంగా కంప్యూటర్​ పరిజ్ఞానం ఉండాలి. వయస్సు 2023 జులై 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య కలిగి ఉండాలి. ఆయా కేటగిరీలను అనుసరించి వయోపరిమితి సడలింపులు కూడా ఉంటాయి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.850 దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 అప్లికేషన్​ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

జులై 1 నుంచి జులై 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం(జనరల్ ₹850) చెల్లింపునకు ఆఖరి తేదీ జులై 21. ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు లేదా సెప్టెంబర్​ల్లో నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్ష 2023 అక్టోబర్​లో జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news