గురుపూర్ణిమ స్పెషల్.. శిర్డీలో మూడ్రోజుల పాటు ఉత్సవాలు

-

దేశవ్యాప్తంగా జూన్ 3వ తేదీన గురిపూర్ణిమ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా దేశంలో ఉన్న సాయిబాబా ఆలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. ముఖ్యంగా గురు పూర్ణిమ ఉత్సవాలకు శిర్డీ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గురుపూర్ణిమ ఉత్సవాలు శిర్డీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో సాయినాథుడికి పూజలు జరగనున్నాయి.

గురు పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకొని.. సంస్థాన్ నిర్వాహకులు శిర్డీని ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలంకరణతో అందంగా ముస్తాబు చేశారు. బాబా దర్శనార్థం శిర్డీకి విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు సంస్థాన్ అధికారులు తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున సాయిబాబాకు ఆలయ అర్చకులు కాకడ హారతి నిర్వహించారు. అనంతరం మందిరం నుంచి సాయి ఫొటో, వీణ, చరిత్ర వచనాలను ఊరేగింపుగా ద్వారకామాయికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో సిద్ధారామ్ సాలిమత్, జిల్లా మేజిస్ట్రేట్, సాయి కమిటీ సభ్యులతో పాటు భక్తులు పాల్గొని.. సాయి నామం పఠించారు. గురు పూర్ణిమ రోజు శిర్డీకి వేల సంఖ్యలో భక్తుల తాకిడి ఉంటుందని వారు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news