గుడ్ న్యూస్… తెలంగాణ పోస్టల్ సర్కిల్ లో జాబ్స్..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. తెలంగాణ పోస్టల్ సర్కిల్ Telangana Postal Circle లో ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నా వాళ్ళు ఆ పోస్టులకి అప్లై చేసుకో వచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

indian post
indian post

తెలంగాణ పోస్టల్ సర్కిల్ లో పలు ఖాళీలు వున్నాయి అని పోస్టల్ శాఖ చెప్పింది. అయితే ఈ పోస్టులు స్పోర్ట్స్ కోటా నుండి భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఖాళీల వివరాలని చూస్తే.. తెలంగాణ పోస్టల్ సర్కిల్ లో మొత్తం 55 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే పోస్టల్ అసిస్టెంట్ విభాగంలో 11 పోస్టులు, RMS ఆఫీసుల్లో 8 అసిస్టెంట్, 25 పోస్టు మ్యాన్, మెయిల్ గార్డు విభాగంలో 1, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ విభాగంలో 10 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో అధికారులు స్పష్టం చేశారు.

ఈ నోటిఫికేషన్ ని ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లోనే ఈజీగా అప్లై చెయ్యచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 24 ఆఖరి తేదీ. పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే https://tsposts.in/sportsrecruitment/ వెబ్ సైట్ లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news