చిరంజీవితో నటుడు ప్రకాశ్ రాజ్ భేటీ !

-

టాలీవడ్‌ పరిశ్రమలో ‘మా’ ఎన్నికల కోలాహలం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లోనే స్టార్‌ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఇవాళ ఉదయం మెగాస్టార్‌ చిరంజీవి ని కలిశారు. స్వయంగా చిరు ఇంటికి వెళ్లి ఆయనను కలిసి దిగిన ఫోటోను ప్రకాశ్‌ రాజ్‌ తన ట్విట్టర్‌ లో షేర్‌ చేశౄడు. దీంతో ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ గా మారింది. “ఈ రోజు ఉదయం పూట బాస్‌ ను జిమ్‌ లో కలిశాను.

 

తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన పరిష్కారాల కోసం ఆయన చొరవ తీసుకోవడం సంతోషంగా ఉంది. మీరెప్పుడూ మాకు స్పూర్తి అన్నయ్య” అంటూ ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్‌ చేశాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఇటీవలే ప్రకాశ్‌ రాజ్‌… సినిమా షూటింగ్‌ గాయపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్‌ లో చేతికి ఆపరేషన్‌ చేయించుకున్నారు. కాగా.. మా ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌ కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news