ఇందిరాగాంధీ టెక్నిక‌ల్ యూనివ‌ర్సిటీలో ఖాళీలు.. వివరాలివే..!

-

ఉద్యోగం కోసం చూసేవారికి శుభవార్త. ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్శిటీ ఫర్ ఉమెన్ టీచింగ్‌, నాన్‌టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి తాజాగా ఒక నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలలోకి వెళితే.. ఇంటర్వ్యూ ద్వారా పోస్టులని భర్తీ చెయ్యనున్నారు. వివిధ పోస్టుల‌కు బీటెక్‌ (Btech), ఎంటెక్‌తో పాటు పీహెచ్‌డీ (Phd) చేసిన అభ్య‌ర్థులు అర్హులు. అంతే కాకుండా ప్ర‌తీ విభాగానికి ప్ర‌త్యేకంగా ఆ రంగంలో ప‌ని చేసిన అనుభవం ఉండాలి.

jobs
jobs

పోస్టుల వివరాలలోకి వెళితే.. ప్రొఫెసర్ పోస్టులు 11 ఉండగా… ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ -02, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ -03, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ -01, మెకానికల్ & ఆటోమేషన్ ఇంజనీరింగ్ -02, ఆర్కిటెక్చర్ మరియు ప్లానింగ్- 02, ఇంగ్లీష్ -01. అలానే అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 17 వున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ -07, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ -04, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ -01, మెకానికల్ & ఆటోమేషన్ ఇంజనీరింగ్ -02.

అలానే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 19 వున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ -04, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ -09, ఆర్కిటెక్చర్ మరియు ప్లానింగ్ -04, భౌతికశాస్త్రం -01, కెమిస్ట్రీ -01. ఇక
నాన్ టీచింగ్‌/ మినిస్టీరియ‌ల్ అయితే ఐదు వున్నాయి. కంట్రోల‌ర్ ఆఫ్ ఎక్జామిన‌ర్‌ -01,
డిప్యూటీ రిజిస్ట్రార్ -01, అసిస్టెంట్ రిజిస్ట్రార్ -02, అసిస్టెంట్ కంట్రోల‌ర్ ఆఫ్ ఎక్జామిన‌ర్‌ -01. ద‌ర‌ఖాస్తు అడ్ర‌స్‌కు చేరుకొనేందుకు ఆఖ‌రు తేదీ అక్టోబ‌ర్ 11, 2021. పూర్తి వివరాలని http://igdtuw.ac.in/tenders.php?nid=1325&type=CAREERS లో చూడచ్చు.

చిరునామా:
Office of the Additional Registrar (HR), Indira Gandhi Delhi Technical University for
Women, First Floor, Administrative Block, Kashmere Gate, Delhi-110 006

 

 

Read more RELATED
Recommended to you

Latest news