మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
స్పెషలిస్ట్ ఆఫీసర్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 23న ప్రారంభం కానుంది. డిసెంబర్ 17 లోగా అప్లై చేసుకోవాల్సి వుంది. ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు జనవరి 22న ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. అడ్మిట్ కార్డులు జనవరి 11 నుంచి అందించనున్నారు.
ఎకనామిస్ట్, ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలా ఎన్నో పోస్టులు వున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, ఎంబీఏ, మాస్టర్ డిగ్రీ, సీఏ, సీఎఫ్ఏ, పీహెచ్డీ చేసిన అభ్యర్థులు అర్హులైన పోస్ట్ కి అప్లై చేసుకో వచ్చు. దరఖాస్తు ఫీజుగా రూ. 850ని నిర్ణయించారు.
అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం నవంబర్ 23. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ డిసెంబర్ 17. అభ్యర్థులు ఆ తేదీ నుంచి www.centralbankofindia.co.in వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలి.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.