ఫోన్‌పేలో మ్యూచ్‌వ‌ల్ ఫండ్ స్పెష‌లిస్ట్ జాబ్స్.. ఇలా అప్లై చెయ్యండి…!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్ ఫోన్‌పే పలు ఉద్యోగాలని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఫోన్‌పే లో మ్యూచువల్ ఫండ్స్ స్పెషలిస్ట్ పోస్టును భర్తీ చేయడానికి రిక్రూట్‌మెంట్ ప్రోగ్రాం నిర్వ‌హిస్తున్న‌ట్లు కంపెనీ అంది. అయితే ఎంపికైన అభ్యర్థులు మ్యూచువల్ ఫండ్స్‌ కి సంబంధించి కస్టమర్స్ తో సందేహాల్ని పరిష్కరించాలి.

phonepe

అలానే ఫండ్స్‌కు సంబంధించి మెరుగైన అనుభ‌వాన్నిఅందించాల్సిన బాధ్యత కూడా వారిదే. అదే విధంగా 0-2 సంవ‌త్స‌రాల వృత్తి అనుభ‌వం ఉండాలి. అందమైన వ్రాత, మౌఖిక సంభాషణా సామ‌ర్థ్యం అవ‌స‌రం అని కూడా ఉండాలని నోటిఫికేషన్ లో వుంది.

అలానే ప‌నికి సంబంధించిన మేనేజ‌మెంట్ స్కిల్స్ ఉండాలి. ఇక ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది చూస్తే.. www.phonepe.com యొక్క అధికారిక పోర్టల్‌ని ఓపెన్ చేసి ఆన్ లైన్ మోడ్ లో అప్లై చెయ్యాల్సి వుంది. అదే విధంగా ఫోన్‌పే కంపెనీ సీనియర్ ఆటోమేషన్ స్పెషలిస్ట్ అండ్‌ సోషల్ మీడియా వాళ్ళని కూడా నియమిస్తోంది. ఆసక్తి, అర్హత ఉంటే ఈ పోస్టులకి కూడా అప్లై చేసుకోచ్చు. ఈ పోస్టులకి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోచ్చు అని నోటిఫికేషన్ లో చెప్పారు.