ఏపీ గ్రామ సచివాలయ పోస్టులకు నోటిఫికేషన్.. 1.6 లక్షల ఖాళీలు

-

ఈ ఉద్యోగాల ఎంపిక కోసం పరీక్షలు నిర్వహించడం లేదు. సేవా దృక్పథం, నిజాయితీని ప్రామాణికంగా తీసుకొని ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దాని కోసం ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

ఏపీ నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే గ్రామ వాలంటీర్ల పోస్టులను నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఏపీలోని ప్రతి గామం, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నియామకాలను నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 1.6 లక్షల ఉద్యోగాలను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనుంది. ప్రతి గ్రామంలో పది మందిని ఉద్యోగంలోకి తీసుకుంటారు.

కనీసం రెండు వేల జనాభా ఉన్న గ్రామాల్లో సచివాలయం ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి. వాటి అమలులో పారదర్శకత, జవాబుదారితనం పెంచడం కోసం గ్రామ సచివాలయ ఉద్యోగులను తీసుకోనున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు గ్రామాల్లో ప్రభుత్వ పథకాల పనితీరును చూసుకుంటారు.

గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు కలిసే పనిచేస్తారు. వాలంటీర్లు ఊళ్లో నుంచి తీసుకొచ్చే ఫిర్యాదులు, వినతులను సంబంధిత శాఖలకు చేరవేర్చేలా కూడా గ్రామ సచివాలయ ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది.

ఇక.. ఈ ఉద్యోగాల ఎంపిక కోసం పరీక్షల్లో వచ్చే మార్కులు ప్రామాణికం కాదు. ఎగ్జామ్స్ మాత్రమే కాదు.. సేవా దృక్పథం, నిజాయితీని ప్రామాణికంగా తీసుకొని ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దాని కోసం ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

పదో తరగతి లేదా ఇంటర్ పూర్తి చేసిన వాళ్లను గ్రామ సచివాయల ఉద్యోగాలకు తీసుకుంటారు. ఆగస్టులో పరీక్ష నిర్వహిస్తారు. జీతం 5 వేల నుంచి 10 వేల వరకు ఉంటుంది. మరిన్ని వివరాల కోసం https://www.ap.gov.in వెబ్ సైట్ ను సందర్శించొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news