తెలంగాణాలో టీచర్ల ఉద్యోగాల నియామకాలపై హై కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి స్పందించారు, ఈమె మాట్లాడుతూ హై కోర్ట్ చెప్పిన ప్రకారమే రాష్ట్రంలో టీచర్లకు బదిలీలు లేదా ప్రమోషన్ లు ఉంటాయని తేల్చి చెప్పింది. అంతే కాకుండా ఈమె మాట్లాడుతూ తొందరలోనే ఉపాధ్యాయుల ప్రమోషన్ లు , పదోన్నతులు మరియు కొత్తగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి సబితా రెడ్డి. ఈ ప్రక్రియ అంతా పూర్తి అయిన తర్వాత ఇంకేమైనా ఉపాధ్యాయులు ఖాళీలు ఉంటే కొత్తగా నోటిఫికేషన్ ను విడుదల చేసి .. ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు.
అయితే వీటన్నిటి మీద అభ్యర్థులు దృష్టిని సారించకుండా డీఎస్సీ కి ప్రత్యేక శ్రద్ధతో శిక్షణ తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్ర రెడ్డి సూచించారు. మీకు రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలను అస్సలు పట్టించుకోవద్దని మంత్రి చెప్పారు.