ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి.. తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులు కేంద్ర మంత్రిగానూ పనిచేశారు చిరంజీవి. అందులోనూ ఆయన కాపు సామాజిక వర్గం. ఆయన బీజేపీలోకి వస్తే.. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఓట్లు బీజేపీకి వేయించుకోవచ్చనేది బీజేపీ ప్లాన్ గా తెలుస్తోంది.
ఆహా.. సూపరో సూపర్. ఎన్నికల తర్వాత కూడా ఏపీలో రాజకీయాలు ఇలా మారిపోతాయని ఎవ్వరూ ఊహించి ఉండరు. అవును.. సడెన్ గా బీజేపీ లైమ్ లైట్ లోకి వచ్చి ఏపీ రాజకీయాలను మార్చేస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఏపీలోని ముఖ్యమైన రాజకీయ నాయకులకు గాలాలు వేస్తోంది. దానిలో భాగంగానే ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. మరో 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్లలో మాజీ మంత్రి గంటా కూడా ఉన్నారు. మొత్తానికి 2024లో ఏపీలో అధికారమే ధ్యేయంగా బీజేపీ ఏపీలో పావులు కదుపుతోంది.
ఆపరేషన్ ఆకర్ష్ ను బీజేపీ.. రామ్ మాధవ్ తో చేయిస్తోంది. రామ్ మాధవ్.. ఏపీలోని ముఖ్య నేతలతో భేటీ అయి.. వాళ్లకు పదవుల ఆశలు చూపుతున్నారు. మరో టీడీపీ నేత అంబికా కృష్ణ కూడా బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అలా.. టీడీపీ కేడర్ పై దెబ్బ కొట్టిన బీజేపీ తాజాగా మెగాస్టార్ చిరంజీవిపై దృష్టి కేంద్రీకరించిందట.
ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి.. తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులు కేంద్ర మంత్రిగానూ పనిచేశారు చిరంజీవి. అందులోనూ ఆయన కాపు సామాజిక వర్గం. ఆయన బీజేపీలోకి వస్తే.. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఓట్లు బీజేపీకి వేయించుకోవచ్చనేది బీజేపీ ప్లాన్ గా తెలుస్తోంది.
ప్రస్తుతానిక చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉన్నా.. ఆయన మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరుపున ప్రచారం నిర్వహించలేదు. ఆయన రాజ్యసభ సభ్యత్వం కూడా గత సంవత్సరమే ముగిసిపోయింది. దీంతో బీజేపీలోకి చిరంజీవిని తీసుకోవాలని బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తోందట. ఇప్పటికే ఆయనతో బీజేపీ నేతలు ఈ విషయంపై చర్చించారట. రాంమాధవ్, కన్నా లక్ష్మీనారాయణ, ఇతర బీజేపీ ముఖ్యలతో ఆయనతో భేటీ అయ్యారట. ఆయన బీజేపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారట. ఆయనకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వడానికి కూడా పార్టీ పెద్దలు సిద్ధంగా ఉన్నారట. అందుకే.. మెగాస్టార్ కూడా బీజేపీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారట. నిజంగానే మెగాస్టార్ చిరంజీవి బీజేపీలోకి వస్తే.. ఆయనకు రాజకీయంగా స్టార్ డమ్ రావడమే కాదు.. ఏపీలో రాజకీయాలు మొత్తం మారిపోతాయి.