నిరుద్యోగులకు శుభవార్త… NPCIL లో ఉద్యోగాలు…!

Join Our Community
follow manalokam on social media

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. దీనిలో మొత్తం 72 ఖాళీలు వున్నాయి. పోస్టులు వివరాల లోకి వెళితే… టెక్నికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్, స్టేషన్ ఆఫీసర్ విభాగాల్లో పోస్టులు వున్నాయి.

ఆసక్తి, అర్హత వున్న వాళ్ళు అప్లై చెయ్యొచ్చు. నెలకు రూ. 47 వేల నుంచి రూ. 67,700 వరకు వేతనం చెల్లించనున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 6న ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి ఆఖరి తేదీని ఏప్రిల్ 20గా నిర్ణయించారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు npcil.nic.in/ npcilcareers.co.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

ఇక ఖాళీలని చూస్తే.. టెక్నికల్ ఆఫీసర్/డీ-మెకానికల్ విభాగంలో 28 ఖాళీలు ఉన్నాయి. టెక్నికల్ ఆఫీసర్/డీ-ఎలక్ట్రికల్ విభాగంలో 10 ఖాళీలు, టెక్నికల్ ఆఫసీర్/డీ-సివిల్ విభాగంలో 12 ఖాళీలు, మెడికల్ ఆఫీసర్/డీ(స్పెషలిస్ట్స్) విభాగంలో 8 ఖాళీలు, మెడికల్ ఆఫీసర్/C(GDMO)లో 7 ఖాళీలు.

డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్/A విభాగం లో 3 ఖాళీలు, స్టేషన్ ఆఫీసర్/A విభాగంలో 4 ఖాళీలు ఉన్నాయి. అలానే మెడికల్ ఆఫీసర్/D(స్పెషలిస్ట్స్) విభాగాల్లో ఎనిమిది ఖాళీలు వున్నాయి. ఒక్కో పోస్ట్ కి వేతనం ఒక్కోలా వుంది. నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు వున్నాయి. చెక్ చేసుకోండి.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...