సీసీఎంబీ హైద‌రాబాద్‌ లో సైంటిస్ట్ ఉద్యోగాలు.. వివరాలివే..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. సెంట‌ర్ ఫ‌ర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బ‌యోలజీ హైద‌రాబాద్‌లో సైంటిస్ట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలని చూస్తే.. ఈ నోటిఫికేష‌న్ ద్వారా సైంటిస్ట్‌, సీనియ‌ర్ సైంటిస్ట్‌, సీనియ‌ర్ ప్రిన్సిప‌ల్ సైంటిస్ట్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి అక్టోబ‌ర్ 11, 2021 వ‌రకు గడువు వుంది.

 

jobs
jobs

ఆ లోగ అప్లై చేసుకోండి. ద‌ర‌ఖాస్తు ఫీజు కేవ‌లం రూ.100. ద‌ర‌ఖాస్తు చేసుకోనే ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు వ‌యోప‌రిమితి స‌డ‌లింపు ఉండ‌నుంది. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. ఒక సైంటిస్ట్ పోస్ట్ వుంది. లైఫ్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసిన వాళ్ళు ఈ పోస్టుకి అప్లై చెయ్యచ్చు. రీసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి. వయోపరిమితి 32 ఏళ్లు మించి ఉండకూడదు. అలానే ఐదు సీనియర్ సైంటిస్ట్ పోస్టులు వున్నాయి.లైఫ్ సైన్స్‌ లో పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి. రెండేళ్ల పని అనుభవం ఉండాలి. వయోపరిమితి 37 ఏళ్లు మించి ఉండకూడదు.

అదే విధంగా రెండు సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఖాళీలు వున్నాయి. లైఫ్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి. ఆరేళ్ల పని అనుభవం ఉండాలి. వయోపరిమితి 50 ఏళ్లు మించి ఉండకూడదు. ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థుల‌లో కొంద‌రిని షార్ట్ లిస్ట్ చేస్తారు. అభ్య‌ర్థుల అనుభ‌వం, అకాడ‌మిక్ సామార్థ్యాల ఆధారంగా షార్ట్ లిస్ట్ ప్ర‌క్రియ ఉంటుంది గమనించండి. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూ ని నిర్వ‌హిస్తారు. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అధికారి వెబ్‌సైట్ ను సంద‌ర్శించాలి. https://www.ccmb.res.in/Careers/Regular-Positions