ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు… పూర్తి వివరాలు ఇవే…!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ పలు పోస్టులని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ లో 17 పోస్టులు ఖాళీగా వున్నాయి. పోస్టుల వివరాలను చూస్తే అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా వున్నాయి.

మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, జనరల్ మెడిసిన్‌, జనరల్ సర్జరీ, అనెస్తీషియా, ఫిజియాలజీ, హ్యూమన్‌ అనాటమీ, ఆరల్‌ అండ్‌ మ్యాక్సిలోఫేషియల్‌ సర్జరీ, బయోకెమిస్ట్రీ మొదలైన విభాగాల్లో ఈ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఇక అర్హత వివరాలను చూస్తే.. మెడికల్ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తో పాటు ఎమ్‌డీ/ఎమ్‌ఎస్‌/డీఎన్బీ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి.

టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి. వయస్సు విషయానికి వస్తే వయసు 69 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చేసుకునేందుకు డిసెంబర్‌ 2, 2022 చివరి తేదీ. పూర్తి వివరాలను https://www.esic.in/EmployerPortal/ESICInsurancePortal/Portallogin.aspx లో చూడచ్చు.

చిరునామా: The Dean, ESIC Dental College and Hospital, Sector-15, Rohini, New delhi-110089.