మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు TSPSC దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.
మొత్తం 181 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) గ్రేడ్-1 ఖాళీలు వున్నాయి.సెప్టెంబర్ 29 సాయంత్రం 5.00 గంటల వరకు అప్లై చేసుకునేందుకు సమయం వుంది. ఇక అర్హత వివరాలను చూస్తే… హోమ్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా సోషల్ వర్క్ కానీ సోషియాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఫుడ్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
ఇక వయస్సు వివరాలను చూస్తే.. జూలై 1, 2022 నాటికి 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలు ఉన్నవాళ్లే అప్లై చేసుకోవడానికి అవుతుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ. 200, పరీక్ష రుసుము కింద రూ. 80 చెల్లించాలి. దరఖాస్తు కోసం మరిన్ని వివరాలను నోటిఫికేషన్ లో చూడచ్చు.
అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి:
మొదట tspsc.gov.in ని ఓపెన్ చెయ్యండి.
తరవాత న్యూ రిజిస్ట్రేషన్ OTR కి వెళ్ళండి.
ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఖాళీల కోసం లాగిన్ అయ్యి దరఖాస్తు ప్రక్రియను కొనసాగించండి.
దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్ చేసాక… పత్రాలను అప్‌లోడ్ చేయండి.
తరవాత రుసుము చెల్లించి సబ్మిట్ చెయ్యండి.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.