ఆసియా కప్ 2022 సూపర్ 4 లో భాగంగా బుధవారం పాకిస్తాన్, ఆఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ను క్రికెట్ అభిమానులు చాలా ఆసక్తికరంగా చూశారు. భారత్ అభిమానుల్లో ఆశలు రేపేలా ఉత్కంఠ రేకెత్తించిన ఈ మ్యాచ్ లో చివరకు పాకిస్తాన్ వికెట్ తేడాతో ఆఫ్గాన్ పై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం షార్జా క్రికెట్ స్టేడియంలో పాక్, ఆఫ్గాన్ అభిమానుల మధ్య తీవ్ర గర్షణ చోటు చేసుకుంది.
మ్యాచ్ అనంతరం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల అభిమానుల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. ఓటమిని తట్టుకోలేని ఆప్గాన్ అభిమానులు షార్జా క్రికెట్ స్టేడియంలోని కుర్చీలను విరగ్గొట్టారు. స్టేడియంలో కుర్చీలను చిందర వందరగా పడేశారు. అంతేకాదు వాటిని విసిరేసారు.
కొందరు ఆఫ్గాన్ ఫ్యాన్స్ పక్కనే ఉన్న పాక్ అభిమానులను చితకబాదారు. పాక్ జెర్సీ వేసుకున్న ఓ వ్యక్తిని మరో వ్యక్తి కుర్చీతో కొట్టాడు. ఆఫ్గానిస్థాన్ జిందాబాద్ అనే నినాదాలతో స్టేడియం మొత్తం మార్మోగిపోయింది. పాకిస్తాన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడంతోనే ఈ గొడవ మొదలైంది. గొడవకు సంబంధించిన వీడియోను మాజీ పెసర్ అక్తార్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి మండిపడ్డారు.
On a serious note, some of these afghan kids really need to learn how to behave. This is an international match not gully cricket. Never happens in any other matches. That's the reason i really respect the other Cricket Teams
#PakvsAfg pic.twitter.com/jwRblDphRA— MUHAMMAD ROBAS (@IAmRobas) September 7, 2022