సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ను ఈ ఏడాది జూన్ 27వ తేదీన నిర్వహిస్తామని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అందులో భాగంగానే సీఎస్ఈ-2021, ఐఎఫ్‌వోఎస్ఈ-2021 లకు గాను పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని తెలిపింది. కాగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2021 (సీఎస్ఈ 2021), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ (ఐఎఫ్‌వోఎస్ఈ 2021) నోటిఫికేషన్లను కూడా బుధవారం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
కాగా ప్రతి ఏడాది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇతర సివిల్ సర్వీసెస్‌కు గాను అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామ్‌ను ముందుగా నిర్వహిస్తారు. ఇందులో మెరిట్ సాధించి క్వాలిఫై అయినవారు మెయిన్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అందులో ర్యాంక్ సాధించిన వారిని ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.
యూపీఎస్సీ క్యాలెండర్ ప్రకారం జూన్ 27వ తేదీనే సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామ్‌ను నిర్వహిస్తారని గతంలోనే సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే యూపీఎస్సీ అదే తేదీని తాజాగా ఖరారు చేసింది.