ఇంటర్‌తో కేంద్ర కొలువులు.. ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ నోటిఫికేషన్‌ విడుదల !

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవల్ (సీహెచ్ఎస్ఎల్) నోటిఫికేషన్ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) విడుదల చేసింది.

పోస్టుల వివరాలుః లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్డీసీ)/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్.

అర్హతలు: ఎల్డీసీ, జేఎస్ఏ, పీఏ, ఎస్ఏ, డీఈఓ పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి. కాగ్ ఆఫీస్లో డాటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు మ్యాథ్స్తో ఇంటర్ ఉత్తీర్ణులు అయి ఉండాలి.

వయస్సు: 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష (టైర్-1, 2), టైపింగ్ / స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తు దాఖలు చేయడానికి చివరితేదీ: డిసెంబర్ 15
ఆన్లైన్ ఫీజు చెల్లింపులకు చివరితేదీ: డిసెంబర్ 17
టైర్-1 పరీక్ష: 2021, ఏప్రిల్ 12 – 27 వరకు
పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://ssc.nic.in

– శ్రీవిద్య