మూవీ రివ్యూ: ‘సర్కారు వారి పాట ‘..మహేష్ బాబు దుమ్ము దులిపేశాడు..

-

నటీనటులు: మహేష్ బాబు, కీర్తి సురేష్,వెన్నెల కిషోర్, సముద్రఖని,సుబ్బరాజు తదితరులు..

కెమెరా: ఆర్.మధు

ఎడిటింగ్‌: మార్తాండ్ కె.వెంకటేష్

సంగీతం: ఎస్ ఎస్ థమన్

నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట

నిర్మాణ సంస్థలు: మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు

దర్శకత్వం: పరశురామ్

రిలీజ్ డేట్: 12 మే 2022

రన్నింగ్ టైమ్: 160 నిమిషాలు

బడ్జెట్ : 60 కోట్లు

మహర్షి నుంచి మహేష్ బాబు ఖాతాలో వరుస హిట్ లు పడుతున్నాయి.ఇటీవల వచ్చిన సరిలేరు నీకెవ్వరు  సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు మహేష్..ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. సినిమా మొదలైనప్పటి నుంచి మంచి టాక్ ను అందుకుంటుంది. ఇప్పుడు పూర్తీ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం..

కథ, విశ్లేషణ:

బ్యాంకింగ్ మోసాల నేపథ్యంలో ఈ సినిమా మొదలవుతుంది. మహేష్ బాబు పాత్ర విషయానికి వస్తే.. యూఎస్ లో ఓ బ్యాంక్‌ లో రికవరీ ఎంప్లాయ్‌గా మహేష్ బాబు కనిపిస్తాడు. తమ బ్యాంకును చీట్ చేసిన బిజినెస్‌ మెన్‌ల నుంచి తెలివిగా మహేష్ డబ్బులు ఎలా వసూలు చేస్తాడు. ఇక అమ్మాయిలకు ఆమడ దూరంలో ఉండే మహేష్ కళావతి (కీర్తి సురేష్)తో ఎలా ప్రేమలో పడ్డాడు ? ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది ? అసలు మహేష్ గతం ఏమిటి ? అనేది మిగిలిన కథ..ఇంటర్వెల్ కి ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్, మహేష్ పాత్రతో ముడిపడిన మిగిలిన పాత్రల ఎమోషన్స్ అద్భుతంగా అనిపిస్తాయి. సెకండాఫ్ లో వచ్చే డ్రామా అండ్ కామెడీ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి..

రొమాన్స్, యాక్షన్, కామెడీ కథా చిత్రంగా డైరెక్టర్ చక్కగా చూపించారు. మహేష్ అద్భుతంగా నటించారు. మహేష్ -వెన్నల కిషోర్ కాంబినేషన్‌ అదిరింది. కీర్తి సురేష్ క్యారెక్టర్ అయితే, ఒక సర్‌ప్రైజ్‌ గా ఉంటుంది. కథను ఎక్కడా సాగ తీయకుండా,సుత్తి లేకుండా చిత్రీకరించారు.మొత్తానికి కథ పరంగా మంచి మార్కులను వేయించుకుంది. మొదటి షో టాక్ ప్రకారం సినిమా బాగుందనే టాక్ వినిపిస్తోంది. కలెక్షన్స్ ఎంత వరకూ ఉంటాయో చూడాలి.

రేటింగ్: 3/5..

Read more RELATED
Recommended to you

Exit mobile version