హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారు..ఈసారి వీరికి మాత్రమే ఛాన్స్‌.

గత కొన్ని సంవత్సరాలుగా డబుల్‌ బెడ్ రూమ్ ఇళ్ల కొసం ఎదురు చూస్తున్న నగర వాసులుకు ఎట్టకేలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది.. హైదరాబాద్‌లో మొదటి విడత డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసింది ప్రభుత్వం..సోమవారం లబ్దిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాలను మంత్రి కేటీఆర్‌ పంపిణీ చేయనున్నారు.

తొలి విడతలో 1,152 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను ఇవ్వనున్నారు..జియాగూడలో 840, కట్టెలమండిలో 120, గోడేకాకబర్‌లో 192 ఇళ్లను మంత్రి కేటీఆర్ సోమవారం పంపిణీ చేయనున్నారు..టీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని..హైదరాబాద్ మహా నగరంలో చాలా చోట్ల ఇప్పటికే 80 శాతానికి పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. త్వరలోనే మిగతా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు పంపకాలు చేపడతామని మంత్రి కేటీఆర్ చెప్పారు.