దాతృత్వం చాటుకున్న విరాట్… 10 వేల మంది చిన్నారుల పోషణకు సాయం..!

ప్రపంచంలోనే అత్యంత ఫాలోయింగ్​ ఉన్న క్రికెటర్లలో విరాట్​ కోహ్లీ ఒకరు. ఆటలోనే కాదు రియల్ లైప్ లోనూ ఆయన హీరోనే. మరోసారి ఆయన గొప్ప మనసును చాటుకున్నారు. 10వేల మంది చిన్నారుల పోషణకు అయ్యే ఖర్చును భరిస్తానని విరాట్ ప్రకటించాడు. మహారాష్ట్రలో పౌష్టికాహార లోపంతో బాధపడుతునన చిన్నారులకు ఆపన్న హస్తం అందించాడు విరాట్. వారి కోసం ‘రా ఫౌండేషన్’‌తో చేతులు కలిపాడు. ఈ మహోన్నత కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నందుకు గర్వపడుతున్నానని విరాట్ తెలిపాడు.

virat kohli
virat kohli

ఇలాంటి గొప్ప పనిలో భాగం అయినందుకు గర్విస్తున్నా.. ‘వైజ్’ సంస్థ ద్వారా దేశంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారికి సాయంగా అందిస్తున్నాను”అని విరాట్ తెలిపాడు. అభిమానుల ప్రేమానురాగలే క్రీడాకారులకు పెద్ద ఆస్తిని విరాట్ అభివర్ణించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ వారియర్స్ అయిన వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది, మీడియానే అసలైన హోరోలు అన్నాడు.వారి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. ఇలా వైజ్‌తో ఒప్పందం చాలా ఆనందాన్ని విషయమన్నారు కోహ్లి. వైజ్ సంస్థకు విరాట్ బ్రాండ్ అంబాసిడర్ గా విరాట్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఆసీస్ పర్యటనలో ఉన్న కోహ్లీ తోటి ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే కెప్టెన్ కోహ్లీ భారత్ తిరిగి రానున్నారని సమాచారం.ఆసీస్‌తో తొలి టెస్ట్ ముగిశాక అతను స్వదేశానికి పయనమవుతాడు. తొలి టెస్టు అడిలైడ్‌లో డిసెంబర్‌ 17 నుంచి 21 వరకు జరగుతుంది. ఈ టెస్ట్ తర్వాత కోహ్లి భారత్‌కు తిరిగి వస్తాడు. ఇక ఈ పర్యటన విషయానికి వస్తే మూడు వన్డే మ్యాచ్‌లు,మూడు టి20 మ్యాచ్‌లు,ఐదు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిలో కోహ్లి సిడ్నీ (జనవరి 7 నుంచి 11), బ్రిస్బేన్‌ (15 నుంచి 19)లలో జరిగే మూడో, నాలుగో టెస్టులకు దూరంమవుతాడు. ఇక విరాట్ సతీమణి విషయానికి వస్తే అనుష్క ఇప్పడు గర్భవతి.. జనవరిలో డెలివరీ టైం ఇచ్చినట్లు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త చక్కర్లు కొడుతుంది.