ipl 2022 : ఐపీఎల్​లో చరిత్ర సృష్టించిన ‘బేబీ ఏబీ’

-

శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తో జరిగిన మ్యాచ్ లో బేబీ ఏబీ గా పిలుచుకునే డేవిడ్ బ్రెవీస్ అరుదైన రికార్డు సాధించాడు.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై కి జరిగిన మ్యాచ్ లో ఆర్ సి బి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.తొలుత ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 151 పరుగులు చేసింది.స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా మూడు వికెట్లు కోల్పోయి ఆర్ సి బి జట్టు విజయాన్ని సాధించింది.ఆ జట్టు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయగా, ముంబై వరుసగా నాలుగో మ్యాచ్ ఓడిపోయింది.

అయితే ఈ మ్యాచ్ లో డేవిడ్ బ్రెవీస్ (బేబీ ఎబి) ఓ అరుదైన రికార్డును సాధించాడు.ఐపీఎల్ కెరియర్ లో తాను వేసిన తొలి బంతికే వికెట్ తీసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు.19వ ఓవర్లో బౌలింగ్ చేసేందుకు వచ్చిన బ్రెవీస్ తాను వేసిన తొలి బంతికే విరాట్ కోహ్లీని ఎల్బిడబ్ల్యు గా అవుట్ చేశాడు.దీనిపై విరాట్ రివ్యూ కి వెళ్లిన ఫలితం ముంబైకి అనుకూలంగానే వచ్చింది.దీంతో కోహ్లీ పెవిలియన్ చేరాల్సి వచ్చింది.తాను వేసిన తొలి బంతికే వికెట్ తీసిన తొలి ప్లేయర్ గా ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ అడమ్ గిల్ క్రిస్ట్ ఉన్నాడు.2013 సీజన్లో పంజాబ్ కింగ్స్ కు ఆడిన గిల్లి..ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసి హర్భజన్ ను ఔట్ చేశాడు.గిల్ క్రిస్ట్ కెరీర్లో తాను వేసిన తొలి, ఆఖరి బంతి ఇదే కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news