బ్రేకింగ్; ఐపిఎల్ లో విదేశీ ఆటగాళ్ళ నిషేధం…? స్టేడియంలలో ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్‌..?

-

ఈసారి ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్లు లేన‌ట్లేనా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా వైరస్ నేపధ్యంలో ఏప్రిల్ 15 వ‌ర‌కు విదేశీ ఆట‌గాళ్ల వీసాలను భారత ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పుడు అన్ని దేశాలను భయపెడుతుంది. ఆ దేశం ఈ దేశం అనే తేడా లేకుండా కరోనా వైరస్ చుక్కలు చూపిస్తుంది. ప్రముఖులకు కూడా ఈ కరోనా వైరస్ సోకడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.

ఈ నేపధ్యంలో భారత ప్రభుత్వం విదేశీయుల విషయంలో కఠిన ఆంక్షలు అమలు చెయ్యాలని భావిస్తుంది. ఇప్పటికే కరోనా లేదని తెలిస్తేనే దేశంలోకి రావాలని ఇటలీ కి చెందిన వారికి ఆంక్షలు పెట్టింది భారత ప్రభుత్వం. ఇక ఇప్పుడు విదేశీ ఆటగాళ్ళ వీసాలను రద్దు చేయడంతో ఈ ఏడాది జరిగే ఐపిఎల్ లో విదేశీ ఆటగాళ్ళు ఆడతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కొందరు ఆటగాళ్ళు దేశానికి వచ్చేశారు.

మరో 17 రోజుల్లో ఈ మెగా టోర్నీ మొదలు అవుతుంది. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళను ఇక్కడి నుంచి పంపించేస్తారా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. లేదా ఐపిఎల్ కి వచ్చే ఆటగాళ్లకు ఏమైనా పరిక్షలు చేసి అనుమతి ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. లేదని తెలిస్తేనే విమానం ఎక్కమనే ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఐపిఎల్ లో ఎక్కువగా విదేశీ ఆటగాళ్ళ హవా ఉంటుంది.

ప్రధానంగా వెస్ట్ఇండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా సహా పలు దేశాల ఆటగాళ్ళ హవా ఉంటుంది. మన దేశంలో ఆయా దేశాల ఆటగాళ్లకు అభిమానులు కూడా ఉన్నారు. వారిలో స్టార్ ఆటగాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వారి వీసాలు రద్దు చేస్తే మాత్రం ఐపిఎల్ కి ఆదరణ తగ్గే అవకాశం ఉంది. ఆయా దేశాల ఆటగాళ్లకు మంచి ధర ఇచ్చి కొనుగోలు చేసారు. మరి వాళ్ళు ఆడకపోతే పరిస్థితి ఏంటీ అనేది కీలక జట్లను వేధిస్తున్న ప్రశ్న.

కరోనా వైరస్ నేపధ్యంలో ప్రేక్షకులు కూడా మైదానానికి వచ్చే పరిస్థితి కనపడటం లేదు. విదేశీ ఆటగాళ్ళు వస్తే మాత్రం సగం భయం ప్రేక్షకులను వేధిస్తుంది. ఏప్రిల్ 15 వరకు వీసాలను రద్దు చేసారు కాబట్టి విదేశీ ఆటగాళ్ళు వచ్చే అవకాశం లేదు. ఆ తర్వాత వాళ్ళు రావాలనుకున్నా సరే దేశం తరుపున ఆడతారు కాబట్టి ఐపిఎల్ కోసం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి వాళ్ళు వస్తే ఇప్పుడే రావాల్సి ఉంటుంది. మరి వాళ్ళు వస్తే కరోనా భయంతో స్టేడియం లో ప్రేక్షకులు ఉండరు. ఈసారి ఐపిఎల్ జరగాలి అంటే, ప్రేక్షకులను మైదానాలకు రానివ్వాలి అంటే కచ్చితంగా విదేశీ ఆటగాళ్ళ వీసాలను రద్దు చేయడమే మార్గం అని భావించినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news