బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 ఇప్పుడిప్పుడే ప్రీ క్లైమాక్స్ దశకు వచ్చేసింది. ఇప్పటికే 75 రోజులు కంప్లీట్ అవ్వగా.. ఇక మరో 25 రోజుల్లో బిగ్‌బాస్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ప్రస్తుతానికి హౌస్‌లో 9 మంది కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. వీరిలో ఈ వారం నలుగురు ఎలిమినేషన్ జోన్‌లో ఉన్నారు. హౌస్‌లో గట్టి కంటెస్టెంట్లుగా ఉన్న వరుణ్ సందేశ్‌తో పాటు రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు పునర్నవి భూపాలం, మహేష్ విట్టా సైతం ఎలిమినేషన్లో ఉన్నారు.
ఇక ఈ నలుగురిలో ఈ వారం ఎవరు ? బయటకు వెళతారు ? అన్నది పరిశీలించినా… సోషల్ మీడియాలో నడుస్తోన్న ట్రెండ్స్‌ను బట్టి చూసినా వరుణ్ సందేశ్, రాహుల్ సింపుల్‌గానే బయట పడతారన్నది స్పష్టంగా తెలిసిపోతోంది. వీళ్లిద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా ఉన్నారు. ఇక మిగిలింది పునర్నవితో పాటు మహేష్. వీరిద్దరి విషయానికి వస్తే ఏ మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ లేని పునర్నవి ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకుంటారు.
అయితే ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ వినపడుతోంది. ఈ వారం పునర్నవి సేఫ్ అయ్యి మహేష్ విట్టా ఎలిమినేట్ అవుతున్నట్టు తెలుస్తోంది. బిగ్‌వాస్ వర్గాల లీకులను బట్టి చూస్తే మహేషే ఎలిమినేట్ అయ్యాడంటున్నారు. పునర్నవి సేఫ్ అవ్వడానికి బిగ్‌బాస్ హెల్ఫ్ చేశాడా ? లేదా ? రాహుల్‌తో ఆమెకు ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో రాహుల్, వరుణ్ అభిమానులు ఆమెను సేవ్ చేశారా ? అన్నదానిపై చర్చలు నడుస్తున్నాయి.
ప్రోమో ప్రకారం పునర్నవికి అభిమానులు ఎక్కువ ఓట్లు వేయడం ద్వారా మహేష్ కోసం దుకాణంలో ఒక షాకర్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనా పునర్నవి – రాహుల్ జంటను విడగొట్టకుండా మరికొంత కాలం హౌస్‌లో ఉంచేందుకే మహేష్‌ను ఎలిమినేట్ చేశాడని మహేష్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరి ఫైనల్‌గా ఎవరు ? ఎలిమినేట్ అవుతున్నారో ? ఆదివారం తేలిపోనుంది.